ABOUT

తీయటి జీవితానికి స్వాగతం పలుకుదాం ....

జీవితం సంతోషం గా సాగుతుందా  లేదా అన్నది మన చేతుల్లోనే కదా ఉన్నది ..

మరి ఎందుకు ఇలా బాధపడడం ..
ఎంతకాలం ఇలా బాధపదగలం ...
ఒక్కసారి మనం ఎందుకు బాధగా ఉన్నామో ఆలోచిస్తే మనకే తెలుస్తుంది కదా ..

కొంతమంది మనుషులు సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తారు ..అంత మాత్రాన వాళ్లకి బాధలు లేవని కాదు అర్థం ..

సంతోషాన్ని, బాధని వేరు చేసే కారణాలు ఏంటంటే ..

1) ఎదుటి వాడితో మనల్ని పోల్చుకోవడం 
2)ఎదుటి వ్యక్తి నుండి ఏదైనా ఆశించడం 
3)ఎదుటి వ్యక్తి ని అర్థం చేసుకోలేకపోవడం 
4)ఎదుటి వ్యక్తి నువ్వు చెప్పిందే చేయాలనుకోవడం 
5)ఎదుటి వ్యక్తి మాటలలో మంచిని మరచి చెడుని వెతకడం 
6)ఎదుటి వ్యక్తి సంతోషాన్ని పంచుకోలేకపోవడం 
7)ఎదుటి వ్యక్తి మోసం చేస్తే ఆ మనిషిని పై ప్రతీకారం తీర్చుకోవాలనుకొవడం 
8)ఎదుటి వ్యక్తి కి సాయం చేసి తన నుండి కృతజ్ఞతను కోరుకోవడం
ఇలా ఎదుటి వ్యక్తి ని గమనిస్తూ బ్రతికినంత కాలం నీ జీవిత గమనం దుఃఖం బాట పడుతుంది ..మనకి నచ్చింది చేస్తూ మనకు ఉన్న దానితో సంతోషపడుతూ నలుగురి సంతోషాలని ,బాదల్ని పంచుకుంటూ సంతోషంగా బ్రతుకుదాం ...

అలాగే యుక్త వయసులో 

     ప్రతి మనిషిలో కలిగే ఆలోచన" ప్రేమ ".తల్లి తండ్రుల పై ప్రేమ చిన్నప్పటి నుండే ఉంటుందనుకోండి ..కాని ఇక్కడ కలిగే ప్రేమ ఒక అమ్మాయి కి అబ్బాయి పైన కలిగేది ,ఒక అబ్బాయికి అమ్మాయి పైన కలిగేది .ప్రేమ అనేది ఎందుకు కలుగుతుందో తెలియదు కాని ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరిపైన కచ్చితంగా కలుగుతుంది...ఈ ప్రేమ కి అర్థాలు అనేకరకాలు...కొందరు ప్రేమ అంటే ఇష్టం లాంటిది అంటారు ..కొంతమంది ఒక భ్రమ లాంటిది అంటారు..

    నా మాటలలో ప్రేమ అంటే 

    మనకు పసిపిల్లలను చూస్తే సంతోషంగా వాళ్ళతో ఆడుకోవలనిపిస్తింది, అలాగే పచ్చని చెట్టు ని చూస్తే చెట్టు నీడ కింద ఎండ తగ్గే వరకు ఉండాలనిపిస్తుంది కదా ..అలాగే కొందరి మనుషులను చూసినప్పుడు వాళ్ళతో ఇంకా కొద్దిసేపు మాట్లాడాలనిపిస్తుంది ...ఇలా ఒక అబ్బాయి  ఒక అమ్మాయిని  చూసినప్పుడు తను జీవితాంతం తనతో ఉంటె చాలా  బాగుంటుంది అనిపిస్తుంది, ఎలాగు ఒక అమ్మాయి తో  జీవితాన్ని పంచుకోవాలి కాబట్టి ..అలా ఎందుకు అనిపిస్తుందంటే నీకు తెలియకుండా నీలో కొన్ని ఇష్టాలు ఉంటాయి ..ఆ ఇష్టాలు కొన్ని విషయయాలలో ఇద్దరు మనుషుల మధ్య  పోలికలలా  కనిపించినప్పుడు  అక్కడ పుట్టేదే" ప్రేమ" అని నా ఉద్దేశం .

      ఈ ప్రేమ విషయం లో నా జీవితమలో జరిగిన సంఘటనలను చెప్పుకోదలచుకున్నాను.నేను చిన్నప్పుడు అంటే 7వ తరగతి లో ఒక అమ్మాయి ని చూసే వాడిని..ఆ అమ్మాయి ని అలా చూస్తూ ఉంటె ఎదో  తెలియని ఆనందం కలిగేది ..ఇంకా చూడాలనిపించేది ..కాని అంతవరకే ఉండేది..

   అలాగే 9వ తరగతి లో ఒక అమ్మాయి భోజనం సమయం లో తన తమ్ముడిని ప్రవీణ్ అంటూ పిలిచేది ప్రేమగా ..నా పేరు కూడా ప్రవీణ్ కదా ..అందుకే నాకు తన పిలుపు వినగానే  ఎదో తెలియని ఆనందం ...అప్పుడు ఇలాంటి వాటిని ప్రేమ అనుకుండే వాడిని..ఎందుకంటే సినిమాలు ఎక్కువగా చూసేవాళ్ళం కదా ..


 కాని నిజమైన ప్రేమ ఎప్పుడు పుడుతుందంటే...

 ఒక మనిషి మరో మనిషి తో జీవితాన్ని పంచుకోవాలి  అన్న  నిజాన్ని తెలుసుకున్నప్పుడు ..ప్రతి మనిషి ఆలోచించే విషయం ఏంటంటే తన తో జీవితాన్ని పంచుకోబోయే వ్యక్తి ఇలా ఉంటె బాగునుంది ,అలా ఉంటె బాగుంటుంది అనుకుంటాడు ..అలా కొన్ని ఇష్టాలు కొన్ని విషయాలలో ఇద్దరి మనుషుల మధ్య పోలికలలా కనిపిస్తాయి ..అలా ఇష్టాలు కలసిన చోట పుట్టేదే ప్రేమ అంటాను ..మొదట ఇది ఆకర్షణ లానే ఉంటుంది ..తర్వాత మనుషుల మధ్య ఇష్టాలు కలిసినప్పుడు ప్రేమ అనేది పుడతుంది అనేది నా అభిప్రాయం.

చివరగా ..
 ప్రేమ తో ప్రేమ లో గడచిన నా క్షణాలు ...తడచిన నా మనసు ...ప్రేమ లో నా అనుభవాల సమ్మేళనమే నా " ప్రేమ కావ్యం" ...




Leave a Reply